విజయేంద్ర ప్రసాద్ కథతో విజయ్ సినిమా!

Vijayendra-Prasad1
తమిళ సూపర్ స్టార్ విజయ్‌కి తమిళనాట ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి బాక్సాఫీస్ స్టామినా ఉన్న హీరోగా విజయ్‌కి తమిళంలో పేరుంది. ఇక తెలుగులోనూ డబ్బింగ్ సినిమాలతో అడపాదడపా మెప్పిస్తూ ఉండే ఈ స్టార్ తాజాగా దర్శకుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్‌తో ఓ సినిమా చేయనున్నారట. విజయ్ హీరోగా, దర్శకుడు అట్లీ తెరకెక్కించనున్న ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చనున్నారట.

బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్ లాంటి ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను కుదిపేసిన సినిమాలకు పనిచేసిన విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తూ ఉండడంతో విజయ్ సినిమాకు ఇప్పట్నుంచే మంచి అంచనాలు బయలుదేరాయి. గతంలో రాజారాణి, తేరీ సినిమాలతో వరుసగా విజయాలు అందుకున్న అట్లీ, విజయ్‌తో తేరీ తర్వాత వెంటనే మరో సినిమా చేస్తూ ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అట్లీ, విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని సమాచారం.

 

Like us on Facebook