వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన ‘మెర్సల్’ టీజర్ !


తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మెర్సల్’ చిత్రం యొక్క టీజర్ నిన్న సాయంత్రం 6 గంటలకు విడుదలై పూర్తిగా ఒక్క రోజు కూడా గడవకముందే వరల్డ్ రికార్డ్ సృష్టించింది. సినిమాపై భారీ అంచనాలతో ఉన్న అభిమానులు, ప్రేక్షకులు టీజర్ విడుదలవగానే వరల్డ్ వైడ్ ట్రేండింగ్ మొదలుపెట్టి రికార్డ్ సృష్టించారు. 9.5 మిలియన్ల వ్యూస్ దాటిపోయి ఇంకొద్దిసేపట్లో 10 మిలియన్ల మార్కును అందుకోనున్న ఈ టీజర్ దగ్గర దగ్గర 7 లక్షల లైక్స్ ను సొంతం చేసుకుని తక్కువ సమయంలో అత్యధిక లైక్స్ ను పాండియన్ టీజర్ గా వరల్డ్ రికార్డ్ సృష్టించింది.

ఈ లెక్కలతో అజిత్ యొక్క ‘వివేగం’ టీజర్ పేరుమీదున్న రికార్డ్స్ బ్రేక్ అయిపోయాయి. విజయ్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని అట్లీ డైరెక్ట్ చేయగా కీర్తి సురేష్, కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తేనాండాల్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

టీజర్ కొరకు క్లిక్ చేయండి

 

Like us on Facebook