ఇంటర్వ్యూ : సందీప్ రెడ్డి వంగ – విజయ్ పెర్ఫార్మెన్స్ మీ మతిపోగొడుతోంది !

ఇంటర్వ్యూ : సందీప్ రెడ్డి వంగ – విజయ్ పెర్ఫార్మెన్స్ మీ మతిపోగొడుతోంది !

Published on Aug 23, 2017 5:16 PM IST


రాబోయే శుక్రవారం విడుదలకానున్న సినిమాల్లో ‘అర్జున్ రెడ్డి’ పైనే అందరిలోనూ అమితాసక్తి ఉంది. దీంతో చిత్ర యూనిట్ కూడా విడిదలపట్ల ఆతురగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) సినిమా ఎమోషనల్ గా ఉంటుంది. పాత్రలు కూడా పూర్తిగా ఎమోషన్ మీదే నడుస్తాయి.

ప్ర) అసలు సినిమా కథేమిటి ?
జ) చాలా మందికి నిజ జీవితంలో బ్రేకప్ లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీలో ఉండే డార్క్ మూడ్ మీద సినిమా తీయాలనుకున్నాను. ఆ ఆలోచనలో నుండి వచ్చిందే ఈ సినిమా.

ప్ర) మీ హీరో విజయ్ ఎలా చేశాడు ?
జ) చాలా బాగా చేశాడు. వారం రోజులు వర్క్ షాప్ చేసిన తర్వాత అతన్ని చూజ్ చేసుకున్నాను. థియేటర్లలో అతని పెర్ఫార్మెన్స్ మీ మతి పోగొడుతుంది.

ప్ర) అర్జున్ రెడ్డి పాత్రకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా ?
జ) నా జీవితంలో నా చుట్టూ జరిగిన సంఘటనల ఆధారంగా, వ్యక్తుల ఆధారంగా స్ఫూర్తి పొంది స్క్రిప్ట్ రాసుకున్నాను. నేను కూడా లవ్ ఫైల్యూరే. ఇందులో నా అనుభవాలు కూడా కొన్ని ఉన్నాయి.

ప్ర) అసలు మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ?
జ) నాది వరంగల్. నేను ఫిజియోథెరపీ చేశాను. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ఫిలిం మేకింగ్లో పీజీ చేశాను.

ప్ర) ఇంతకుముందు సినిమాలేవైనా చేశారా ?
జ) నాగార్జునగారి ‘కేడి’ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశా. ఆ తర్వాత ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ కి స్క్రిప్ట్ వర్క్ చేశాను.

ప్ర) లిప్ లాక్ పోస్టర్ల వివాదం విషయంలో మీ స్పందన ఏంటి ?
జ) ఆ పోస్టర్లో తప్పుందని నేను అనుకోను. ఎందుకంటే అదొక డీప్ ఫీలింగ్. పోస్టర్ చూస్తే హీరో హీరోయిన్ ఇద్దరూ కళ్ళు మూసుకునే ఉంటారు. ఆ ఫిలింగ్ ను క్యాచ్ చేస్తారని అనుకున్నా కానీ కొందరు అందులో అశ్లీలతను వెతికారు.

ప్ర) సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పిన పదాల్ని ఏం చేశారు ?
జ) అవును. సెన్సార్ బోర్డు కొన్ని పదాలకు అభ్యంతరం చెప్పింది. వాటిని మ్యూట్ చేశాం. అవేమంత తప్పుపట్టాల్సిన పదాలు కాదు. ఆ పాత్ర, అది ఉన్న పరిస్థితులకు ఆ పదాలే కరెక్ట్. కానీ సెన్సార్ బోర్డు అడ్డు చెప్పడం వలన తీసేశాం.

ప్ర) సినిమా రన్ టైం ఎక్కువగా ఉన్నట్టుంది ?
జ) ఒక్కో సినిమాకి కొంత టైమ్ పిరియడ్ ఉంటుంది. ఎమోషనల్ గా చెబితే ఆ రన్ టైమ్ బోర్ కొట్టదు. ఈ సినిమాకు అంతే. మూడు గంటలు పెద్ద విషయం కాదు. ఎందుకంటే సినిమాలో ఎమోషనల్ కంటెంట్ ఉంది కాబట్టి.

ప్ర) సినిమాకు ఇంత హైప్ వస్తుందని అనుకున్నారా ?
జ) టీజర్ కైతే అంతలా క్రేజ్ వస్తుందని అనుకోలేదు. కానీ ట్రైలర్ కు మాత్రం ముందుగానే ఊహించాం. అనుకున్నట్టే వచ్చింది.

ప్ర) కథ ముందుగా శర్వాకి చెప్పారని విన్నాం. విజయ్ వద్దకు వచ్చేటప్పటికి చేంజెస్ ఏమైనా చేశారా ?
జ) అవును. ముందుగా శర్వాకు కథ చెప్పాను. కానీ వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత విజయ్ కు చెప్పాను. కథలో మార్పులైతే ఏం చేయలేదు.

ప్ర) హీరోయిన్ కు సినిమాలో లిప్ లాక్స్ ఉంటాయని చెప్పారా ?
జ) చెప్పలేదు. ఎందుకంటే ఆమె జబల్ పూర్ లో స్టేజ్ ఆర్టిస్ట్. అక్కడి వాళ్లకు పెర్ఫార్మన్స్ అనేది దైవంతో సమానం. సినిమాకు అవసరం అనిపిస్తే ఎలాంటి సన్నివేశమైనా చేస్తారు. వాళ్ళ సంగతి నాకు ముందే తెలుసు కనుక లిప్ లాక్స్ గురించి చెప్పలేదు.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ?
జ) రెండు స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి. ఒక పెద్ద హీరో నుండి కాల్స్ కూడా వస్తున్నాయి. ముందు ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు