ఒకే రోజు పోటీకి సిద్దమవుతున్న రజినీకాంత్ – విక్రమ్.?

ఒకే రోజు పోటీకి సిద్దమవుతున్న రజినీకాంత్ – విక్రమ్.?

Published on Oct 30, 2014 7:46 PM IST

rajini-vikram
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా ‘లింగ’. దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని చివరి పాట షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతోంది. ఈ సినిమా ప్రారంభమైన కొద్ది రోజులకే ఈ సినిమాని రజినీకాంత్ బర్త్ డే కానుకగా డిసెంబర్ 12న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసారు. కెఎస్ రవికుమార్ – రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్నా ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

తాజాగా బాక్స్ ఆఫీసు వద్ద రజినీకాంత్ ని డీ కొట్టడానికి శంకర్ తన ‘ఐ’ సినిమాతో సిద్దమవుతున్నాడు. టెక్నికల్ వర్క్ వల్ల ఈ సినిమా విడుదల ఇప్పటికే ఆలస్యం అయ్యింది. శంకర్ సన్నిహితులు చెబుతున్న సమాచారం ప్రకారం శంకర్ కూడా ‘ఐ’ సినిమాని డిసెంబర్ రెండవ వారంలో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడని అంటున్నారు. విక్రమ్ అమీ జాక్సన్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ పై భారీ అంచనాలున్నాయి.

ఇప్పుడు అందరు మదిలో ఉన్న మాటేమిటంటే అనుకున్నట్లుగానే వీరిద్దరూ ఒకే రోజు తమ సినిమాలతో బాక్స్ ఆఫీసు వద్ద తలపడతారా లేక ఒకరి కోసం ఎవరన్నా రిలీజ్ ని వాయిదా వేసుకొని ఎవరో ఒకరే సోలోగా వస్తారా అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు