నాగ చైతన్య కోసం హిట్ ఫార్ములాను పట్టిన డైరెక్టర్

నాగ చైతన్య కోసం హిట్ ఫార్ములాను పట్టిన డైరెక్టర్

Published on Mar 22, 2020 10:46 PM IST

నాగ చైతన్య కెరీర్లోని హిట్ సినిమాల్లో కూడా ‘ప్రేమమ్’ కూడా ఒకటి. మలయాళ చిత్రం ‘ప్రేమమ్’కు ఇది రీమేక్. మూడు ఏజ్ గ్రూపుల్లో నడిచే ప్రేమ కథ కావడం మూలానే ఈ సినిమా ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. అందుకే అలాంటి కథనే నాగ చైతన్య కోసం సిద్దం చేయాలని అనుకుంటున్నారట ఒక డైరెక్టర్. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరని అనుకుంటున్నారా.. అతనే విక్రమ్ కుమార్.

విక్రమ్ కుమార్ గతంలో అక్కినేని ఫ్యామిలీతో ‘మనం’ అనే సూపర్ హిట్ చిత్రాన్ని తీశారు విక్రమ్ కుమార్. అంతేకాదు అఖిల్ హీరోగా ‘హలో’ అనే చిత్రాన్ని కూడా రూపొందించారు. అందుకే ఈసారి అతనికి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాడట. మరోవైపు శేఖర్ కమ్ముల సినిమా ముగియగానే చైతన్య వేరొక దర్శకుడికి డేట్స్ ఇచ్చారని కూడా టాక్ ఉంది. మరి చివరగా చైతూ ఎవరితో సినిమా ఫైనల్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు