‘మనోహరుడు’లో తోడేలుగా కనిపించనున్న విక్రమ్.!

‘మనోహరుడు’లో తోడేలుగా కనిపించనున్న విక్రమ్.!

Published on Aug 27, 2014 8:47 AM IST

manoharudu
సౌత్ ఇండియన్ ఫిల్మ్ స్టాండర్డ్స్ ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుల్లో శంకర్ ప్రధముడని చెప్పుకోవచ్చు. శంకర్ ప్రస్తుతం విక్రమ్ హీరోగా ‘ఐ’ సినిమాని తెరకెక్కించారు. షూటింగ్ మొత్తం పూర్తయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. శంకర్ ఎన్నడూ లేనతంటగా 180 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమాదీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సెప్టెంబర్ 15న జరగనున్న ఆడియో వేడుకకి హాలీవుడ్ స్టార్స్ అయిన జాకీ చాన్, ఆర్నాల్డ్ ముఖ్య అథిదులుగా రానున్నారు.

ఈ సినిమాలో విక్రమ్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. ఆ 3 గెటప్స్ కి సంబందించిన పూర్తి వివరాలు మీ కోసం..

1. మనిషి నుంచి భయంకరమైన తోడేలుగా మారడం – ఈ లుక్ కోసం విక్రం 12ఓ కేజీల బరువు పెరిగాడు. అలాగే తోడేలుగా విక్రమ్ కి మేకప్ వేసుకోవడానికి 1-7 గంటల టైం పట్టేది, అప్పుడప్పుడు 12 గంటలు కూడా పట్టేది. ఈ తోడేలు గెటప్ పై వచ్చే ఓ పాట కోసం 3000 ఎకరాల్లో వేసిన ఓ సెట్లో 21 రోజుల పాటు షూట్ చేసారు.

తోడేలుగా విక్రమ్ ఫస్ట్ లుక్ –
Manoharudu-1

2. స్లిమ్ గా ఉండే యంగ్ స్టర్ – ఈ లుక్ లో బాగా స్లిమ్ గా కేవలం 60 కేజీల బరువు మాత్రమే ఉండి పర్ఫెక్ట్ పిజిక్ కలిగిన యువకుడిలా కనిపిస్తాడు. దీనికోసం విక్రమ్ చాలా వర్కౌట్స్ చేసాడు.

యంగ్ బాయ్ లుక్ –

Manoharudu-2

3. చూడటానికి కాస్త వికృతాకారంలో ఉండే పాత్ర – ఈ పాత్రలో విక్రమ్ బాగా సన్నగా ఉండడమే కాకుండా కాస్త వికృతాకారంలో అందవిహీనంగా కనిపిస్తాడు.

వికృతాకారం గెటప్ –
Manoharudu-3

విక్రమ్ చేసిన ఈ మూడు లుక్స్ పై మీ కామెంట్ ని కింద కామెంట్స్ రూపంలో తెలపండి..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు