సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 8లో విక్రమ్ ‘ఐ’

సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 8లో విక్రమ్ ‘ఐ’

Published on Dec 27, 2014 4:30 PM IST

Salman-Khan-I
సౌత్ ఇండియన్ సినిమాలు భారి విజయాలు సాదిస్తే తప్ప 100 కోట్ల రూపాయల వసూళ్లు రావడం లేదు. అటువంటి సమయంలో దర్శకుడు శంకర్ మరియు కథపై నమ్మకంతో 180 కోట్ల రూపాయల భారి బడ్జెట్ తో ‘ఐ’ సినిమా నిర్మించారు. ఆ స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టడానికి భారి ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటివలే విడుదలైన అమీర్ ఖాన్ ‘పీకే’, నార్త్ అమెరికాలో ‘ది హాబిట్ అఫ్ బాటిల్ అఫ్ ఫైవ్ అర్మీస్’ సినిమాలతో పాటు ‘ఐ’ టీజర్ ను ప్రదర్శించారు. తాజాగా సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ 8’ రియాలిటీ షోలో ‘ఐ’ సినిమా ప్రమోషన్ నిర్వహించడానికి ప్లాన్ చేశారు.

రెండు రోజుల క్రితం కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను విక్రమ్ కలసి ‘ఐ’ సినిమా ప్రమోషన్ గురించి చర్చించారు. ‘ఐ’ ట్రైలర్ చూసిన సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ ఫిదా అయ్యారు. వచ్చే వారంలో విక్రమ్ పోల్గోనబోయే ‘బిగ్ బాస్ 8’ ఎపిసోడ్ ను షూట్ చేస్తారు. అని ఆస్కార్ ఫిల్మ్స్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇండియాలో ఈ షో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు