సోషల్ కంటెంట్ తో వస్తోన్న విక్రమ్ !

సోషల్ కంటెంట్ తో వస్తోన్న విక్రమ్ !

Published on Jan 22, 2018 1:15 PM IST

‘సేతు, అపరిచితుడు, శివపుత్రుడు, ఐ’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన విక్రమ్ పక్కా మాస్‌ పాత్రలో నటించిన సినిమా ‘స్కెచ్‌’. వి.క్రియేషన్స్ సంస్థలో కలైపులి ఎస్. థాను నిర్మించిన ఈ సినిమాను విజయ్ చందర్ తెరకెక్కించారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ’ త్వరలో తెలుగులో విడుదలకానుంది. ఈ సందర్భంగా విక్రమ్ తెలుగు మీడియాతో ముచ్చటించారు.

సోషల్ కంటెంట్ ఉన్న మాస్ సినిమా స్కెచ్. తమిళ్ లో విడుదలై మంచి విజయం సాదించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించబోతుందని విక్రమ్ అన్నారు. ‘స్కెచ్’ సినిమాతో నటుడిగా నాలోని మరో కోణాన్ని ప్రదర్శించడానికి ఆస్కారం కలిగిందని ఈ హీరో తెలిపాడు. త్వరలో ‘మహావీర్ కర్ణ’ సినిమాలో కర్ణుడి పాత్రలో కనిపించబోతున్నారు విక్రమ్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు