మరో మెగా హీరోని డైరెక్ట్ చేయనున్న వినాయక్ !

మరో మెగా హీరోని డైరెక్ట్ చేయనున్న వినాయక్ !

Published on Jan 20, 2017 8:31 AM IST

vv-vinayak
వినాయక్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో మారు మోగిపోతున్న పేరు. మెగాస్టార్ పునరాగమన చిత్రం ‘ఖైదీ నెం 150’ ని డైరెక్ట్ చేసి డైరెక్టర్ గా కెరీర్లోనే భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న ఈయన త్వరలోనే మరో మెగా హీరోని డైరెక్ట్ చేయనున్నట్లు బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు చిరంజీవి మేనల్లుడు ‘సాయి ధరమ్ తేజ్’. మాస్ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ధరమ్ తేజ్ ను వినాయక్ అయితే బాగా ఎలివేట్ చేస్తాడని మెగా క్యాంప్ ఈ నిర్ణయం తీసుకుందట.

ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే చర్చలు ముగిశాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వినాయక్ గతంలో రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి మెగా హీరోలని డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ధరమ్ కూడా వినాయక్ తో పని చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడట. ఇకపోతే ధరమ్ తేజ్ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరక్షన్లో ‘విన్నర్’ చిత్రం చేస్తూనే కృష్ణ వంశీ ‘నక్షత్రం’ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు