ఇంకొద్దిసేపట్లో ‘విఐపి-2’ ట్రైలర్ !

ఇంకొద్దిసేపట్లో ‘విఐపి-2’ ట్రైలర్ !

Published on Jun 25, 2017 5:30 PM IST


ధనుష్ నటించిన చిత్రం ‘విఐపి’ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ధనుష్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అంతేగాక తెలుగులో ‘రఘువరన్ బి.టెక్’ పేరుతో విడుదలై ఇక్కడ కూడా మంచి విజయాన్నందుకుని తెలుగులో ధనుష్ మార్కెట్ స్థాయిని పెంచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా ‘విఐపి-2’ చేస్తున్నాడు ధనుష్.

రజనీకాంత్ కుమార్తె డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా యొక్క ట్రైలర్ ఇంకొద్దిసేపట్లో రిలీజ్ కానుంది. ముందుగా తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేసి ఆ తర్వాత కొద్దిరోజులకి హిందీలో ట్రైలర్ ను విడుదల చేస్తామని ధనుష్ తెలిపారు. ఇకపోతే ఈరోజు ఉడయమే మూడు భాషల్లోనూ పాటలు విడుదల కాగా ఆడియో వేడుక ఈరోజు సాయంత్రం ముంబైలో గ్రాండ్ గా జరగనుంది. జూలై 28న రిలీజ్ కానున్న ఈ చిత్రంపై తమిళనాట భారీ స్థాయి అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు