విరాట పర్వం నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్

విరాట పర్వం నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్

Published on Jun 4, 2020 9:50 AM IST

హీరోయిన్ ప్రియమణి విరాటపర్వం మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు ప్రియమణి బర్త్ డే పురస్కరించుకొని ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. నలుపు రంగు బట్టలు, భుజానికి తుపాకి తగిలించుకొని నక్సలైట్ గెటప్ లో ప్రియమణి లుక్ ఆసక్తి రేపుతోంది. వ్యవస్థపై ద్వేషంతో నక్సలైట్ గా మారిన భారతక్క అనే రోల్ ప్రియమణి చేస్తున్నట్లు సమాచారం.

రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ మరియు శ్రీ లక్ష్మీ వెంకటేశర్య క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. పీరియడ్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో రానా మరియు సాయి పల్లవి పాత్రలు కూడా కొత్తగా ఉండనున్నాయి. దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కిస్తుండగా, త్వరలో షూటింగ్ పూర్తి కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు