విశాల్ కి అనుకూలంగా హై కోర్ట్ నిర్ణయం !

విశాల్ కి అనుకూలంగా హై కోర్ట్ నిర్ణయం !

Published on Feb 22, 2017 5:14 PM IST


హీరో విశాల్ కు సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు మధ్య జరుగుతున్న వివాదానికి హైకోర్ట్ తీర్పుతో చెక్ పెట్టింది. తమిళ పరిశ్రమలో ఫీల్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు జరుగుతున్న ఎన్నికల్లో విశాల్ వివిధ స్థాయి పదవులకు నామినేషన్ దాఖలు చేశారు. కానీ దక్షిణభారత నటీనటుల సంఘం మాత్రం విశాల్ కు అలా వివిధ పదవుల్లో పోటీ చేసే అర్హత లేదని, కేవలం ఒక పదవిలో మాత్రమే పోటీ చేయదానికి వీలుంటుందని కండిషన్ పెట్టింది.

ఈ మేరకు మద్రాస్ హై కోర్టులో పోటీకి విశాల్ అర్హతలను సవాల్ చేస్తూ పిటిషన్ కూడా దాఖలు చేసింది. దీన్ని విచారించిన హైకోర్టు విశాల్ వివిధ పదవులకు పోటీ చెయ్యొచ్చని తీర్పు చెప్పింది. దీంతో విశాల్ వర్గీయులు సంతోషం వ్యక్తం చేశారు. గత నవంబర్లో విశాల్ కౌన్సిల్ మీద మీడియాతో పొరపాటుగా మాట్లాడారని ఆయన్ను కౌన్సిల్ సస్పెండ్ చేయగా ఆ తర్వాత విశాల్ క్షమాపణ పత్రం సమర్పించడంతో కౌన్సిల్ అతనికి క్షమాపణను అంగీకరించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు