సంక్రాంతి బరిలోకి దిగనున్న విశాల్ సినిమా !
Published on Nov 11, 2017 2:56 pm IST

విశాల్ తాజాగా ‘డిటెక్టివ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన నటనతో ఈ సినిమాలో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం విశాల్, సమంత హీరో హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న సినిమా ‘ఇరుంబుదురై’ మిత్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఈ సినిమాలో అర్జున్‌ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. సమంత పెళ్లి అలాగే నడిగార్ సంగం ఎలక్షన్స్ వల్ల సినిమా కాస్త ఆలస్యం అయ్యింది. తాజా సమాచారం మేరకు వచ్చే ఏడాది సంక్రాంతి కి రెండు భాషల్లో ఒకేసారి సినిమాను విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. పవన్ కళ్యాణ్ , బాలకృష్ణ సినిమాలు సంక్రాంతికి వస్తున్న సంగతి తెలిసిందే.

 
Like us on Facebook