వాయిదా పడిన విశాల్ సినిమా !

వాయిదా పడిన విశాల్ సినిమా !

Published on Dec 12, 2017 8:52 PM IST

విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘అభిమన్యుడు’ సమంత హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు పి.ఎస్.మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కి ఈ సినిమా విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ తాజాగా మూవీ టీం విడుదల చేసిన పోస్టర్ లో జనవరి 26 న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ఉంది.

కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అర్జున్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఇటివల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమాకు జార్జి సి. విలియమ్స్‌ సినిమాటోగ్రఫి అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు