‘పూజ’ సక్సెస్‌ టూర్ ప్లాన్ చేస్తున్న విశాల్..!

‘పూజ’ సక్సెస్‌ టూర్ ప్లాన్ చేస్తున్న విశాల్..!

Published on Oct 25, 2014 12:09 PM IST

pooja-movie-review
దీపావళి కానుకగా విడుదలైన ‘పూజ’ ఘనవిజయం సాధిచడం చాలా సంతోషంగా ఉంది. 7 ఏళ్ళ తర్వాత హరి దర్శకత్వంలో నటించాను. హరి గారు యాక్షన్ తో పాటు ఫ్యామిలీ వాల్యూస్ ని చక్కగా మిక్స్ చేశారు. సినిమాలో యాక్షన్‌ సీక్వెన్స్‌ కు మంచి స్పందన వస్తుంది. కలెక్షన్స్ బాగున్నాయి. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్లు చాలా హ్యాపీగా ఉన్నారు. త్వరలో సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు విశాల్. ఆయన హీరోగా నటించిన ‘పూజ’ విజయవంతం కావడంతో శుక్రవారం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విశాల్ తో పాటు దర్శకుడు హరి కూడా పాల్గొన్నారు.

విశాల్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు స్ట్రెయిట్ సినిమా తరహాలో ఆదరించారు. అన్ని ఏరియాల నుండి హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ ఎపిసోడ్ లు బాగున్నాయని ప్రశంసిస్తున్నారు. శృతి హాసన్ తో మొదటిసారి నటించాను. చాలా మంచి ఆర్టిస్ట్. బాగా సపోర్ట్ చేసింది. హరి గారి దర్సకత్వంలో త్వరలో మరో సినిమా చేస్తాను అని అన్నారు. విశాల్‌ మంచి నటుడు మాత్రమే కాదు, మంచి నిర్మాత. ‘పూజ’ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ప్రేక్షకులు సినిమాను హిట్ చేసినందుకు ఆనందంగా ఉంది అని దర్శకుడు హరి తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు