జోరు పెంచిన విశాల్..!

vishal-new-film
తెలుగు, తమిళ భాషల్లో యాక్షన్, కుటుంబ కథా చిత్రాలతో అందరికీ దగ్గరైన హీరో విశాల్, ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే రెండు సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తోన్న ఆయన, తాజాగా మరో కొత్త సినిమాను మొదలుపెట్టేశారు. ‘తుప్పరివాలన్’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా నేడు చెన్నైలో ప్రారంభమైంది. మిస్కిన్ దర్శకత్వం వచించనున్న ఈ సినిమాను విశాల్ తన సొంత బ్యానర్‍ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీపై నిర్మిస్తున్నారు.

ఇక విశాల్ గత చిత్రాల స్టైల్లోనే ఓ యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా ఉంటుందని దర్శకుడు తెలియజేశారు. వచ్చే ఏడాది వేసవికి తుప్పరివాలన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇదిలా ఉంటే విశాల్, తమన్నా నటించిన కత్తిసంధై (ఒకడొచ్చాడు) దీపావళికి విడుదల కానుంది. తుప్పరివాలన్‌తో పాటు పందెం కోడి 2, టెంపర్ రీమేక్ తదితర ఇతర సినిమాలతో విశాల్ ప్రస్తుతం స్టార్ హీరోగా అవతరించారనే చెప్పుకోవాలి.

 

Like us on Facebook