విశాల్‌ ‘యాక్షన్’‌కి ప్రీ రిలీజ్ బిజినెస్.. !

విశాల్‌ ‘యాక్షన్’‌కి ప్రీ రిలీజ్ బిజినెస్.. !

Published on Nov 13, 2019 7:54 PM IST

యాక్షన్ హీరో విశాల్‌ హీరోగా తెరకెక్కిన పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ ‘యాక్షన్’‌. ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్‌ సి దర్శకత్వంతో రూపొందిన ఈ సినిమా అటు తమిళంతో పాటు, ఇటు తెలుగులోనూ మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. కాగా ఈ చిత్రం ఈ శుక్రవారం తెలుగులో దాదాపు 300 స్క్రీన్లలో విడుదల అవుతుంది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ 7.5 కోట్లకు లాక్ చేయబడింది, ఇది విశాల్ మార్కెట్ కి మంచి ఎమౌంటే.

ఇక ఈ సినిమాలో విశాల్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా, ఐశ్వర్య లక్ష్మీ కథానాయకలుగా నటిస్తున్నారు. మాస్ ప్రేక్షకుల్ని టార్గెట్ చేసుకొని రూపొందించిన ఈ సినిమాలో విశాల్‌ కల్నల్‌ సుభాష్‌ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ శుక్రవారం తెలుగులో పెద్ద సినిమాలేవీ లేకపోవడం తెలుగు బాక్సాఫీస్ వద్ద ‘యాక్షన్’కి బాగా కలిసొచ్చే అంశం. మరి ‘యాక్షన్’తో విశాల్, ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు