అక్టోబర్లో విడుదలకానున్న విశాల్ సినిమా!

అక్టోబర్లో విడుదలకానున్న విశాల్ సినిమా!

Published on Sep 19, 2017 2:27 PM IST


విశాల్ చేసిన తాజా చిత్రం ‘తుప్పరివాలన్’ గత వారం విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుని మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. విశాల్ కు తెలుగులో కూడా క్రేజ్ ఉండటంతో ఆ చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగులో ‘డిటెక్టివ్’ పేరుతో ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం డబ్బింగ్ కొలనులు మొదలయ్యాయని, అన్ని పూర్తై చిత్రం అక్టోబర్ నెలలో రిలీజవువుతుందని నిర్మాత జి. హరి అన్నారు.

విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సమర్పణలో మిస్కిన్‌ డైరెక్ట్ చేసిన ఈ సినిమా విశాల్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్సును సాధించిన రికార్డును సొంతం చేసుకుంది. విశాల్ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఆండ్రియా, సిమ్రాన్ లు పలు కీలక పాత్రలు పోషించారు. త్వరలోనే తెలుగు విడుదలకు సంబందించిన ప్రమోషన్లను కూడా మొదలుపెట్టనున్నారు చిత్ర యూనిట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు