విశాల్ నామినేషన్ ను తిరస్కరించిన ఎలక్షన్ కమీషన్ !

తమిళ హీరో విశాల్ నిన్న చెన్నైలోని ఆర్కే నగర్ కు జరగనున్న ఉపఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కానీ పరిశీలన అనంతరం ఆయన నామినేషన్ ను తిరస్కరించింది ఎలక్షన్ కమీషన్. నామినేషన్ ధాఖలు సమయంలో విశాల్ ను ప్రతిపాదిస్తున్నట్టు పేర్కొన సభ్యుల వివరాల్లో స్పష్టత లేనందు వల్లనే కమీషన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది.

ఎంతో ఉత్సాహంతో రాజకీయాల్లోకి ప్రవేశించాలని విశాల్ వేసిన తొలి అడుగే ఇలా తిరస్కరణకు గురికావడం ఆయనకు కొంత నిరుత్సాహాన్ని కలిగించే విషయమనే చెప్పాలి. మరి ఈ తిరస్కరణపై విశాల్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇకపోతే ఆయన నటిస్తున్న ‘అభిమన్యుడు’ చిత్రం వచ్చే సంవత్సరం జనవరి 13న విడుదలకానున్న సంగతి తెలిసిందే.

 

Like us on Facebook