మలేషియా వెళ్లనున్న మంచు విష్ణు !
Published on Jul 16, 2017 3:44 pm IST


మంచు విష్ణు నటిస్తున్న చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’ మలేషియాలో షూటింగ్ జరుపుకోనుంది. ఇప్పటికే హైదరాబాద్లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సుమారు 25 రోజుల పాటు జరగబోయే మలేషియా షెడ్యూల్ కు సిద్ధమవుతోంది. ఈ షెడ్యూల్ తర్వాత మరో షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు చిత్ర టీమ్.

విష్ణు సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు బ్రహ్మానందం ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. నిర్మాత ఎమ్. ఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జి. నాగేశ్వర రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా కెరీర్లో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న మంచు విష్ణుకు ఈ సినిమాతో తప్పకుండా సక్సెస్ దొరుకుతుందని చిత్ర సన్నిహిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ సినిమా మాత్రమే గాక జిఎస్. కార్తీక్ డైరెక్షన్లో ‘ఓటర్’ అనే మరొక సినిమా సైతం చేస్తున్నాడు విష్ణు.

 
Like us on Facebook