విష్ణు సరసన హాట్ బాలీవుడ్ బ్యూటీ

విష్ణు సరసన హాట్ బాలీవుడ్ బ్యూటీ

Published on Nov 29, 2015 8:03 PM IST

vishnu-manchu
సినిమా సినిమాకి కొత్తదనంతో పాటు ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న మంచు విష్ణు హీరోగా నటిస్తున్న సినిమా ‘సరదా’. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది సెట్స్ పై ఉండగానే మంచు విష్ణు యంగ్ హీరో రాజ్ తరుణ్ తో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సిద్దమయ్యాడు. జి నాగేశ్వర్ రెడ్డి ఇప్పటికే ఆ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ని దాదాపు ఫినిష్ చేసాడు. ఈ సినిమాలో విష్ణు సరసన ఓ బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేసారు.

ఈ ఏడాది అనేగన్(అనేకుడు) సినిమాతో తమిళ చిత్ర సీమకు పరిచయమైన భామ అమర్య దస్తూర్. తెలుగులో పూరి జగన్నాధ్ రోగ్ సినిమాకి సైన్ చేసింది అమర్య, ఆ సినిమా తర్వాత నాగేశ్వర రెడ్డి సినిమాలో మంచు విష్ణుకి జోడీగా నటించడం కోసం ఈ భామ సైన్ చేసింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ కి జోడీగా నటించే హీరోయిన్ ని ఎంపిక చేసే పనిలో ఉన్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించనున్న ఈ సినిమా పంజాబీ కామెడీ ఫిల్మ్ కి రీమేక్. జనవరి చివరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు