లక్కీ హీరోయిన్ తో మరోసారి జతకట్టనున్న మంచు విష్ణు

hansika-in-manchu-vishnu-
మంచు హీరో విష్ణు మరోసారి తనకు కలిసొచ్చిన హీరోయిన్ తో జతకట్టనున్నాడు. వరుస ఫ్లాపుల్లో ఉన్న తనకు ‘దేనికైనా రెడీ’ చిత్రంతో మంచి బ్రేక్ ఇచ్చిన హీరోయిన్ హన్సికతో విష్ణు మరో సినిమాకి రెడీ అవుతున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘గీతాంజలి’ ఫేమ్ ‘రాజ్ కిరణ్’ తెరకెక్కించనున్నాడు.

మునుపు యాక్షన్ ఫార్ములాని నమ్ముకుని వరుస పరాజయాలను రుచి చూసిన విష్ణు చివరగా నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ‘దేనికైనా రెడీ’ వంటి కామెడీ ఎంటర్టైనర్ తో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అందుకే విష్ణు ఈసారి కూడా అదే జానర్ లో సినిమా తీసి మరో విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నంలో ఈ ప్రాజెక్టుకు సైన్ చేసినట్టు తెలుస్తోంది.

 

Like us on Facebook