సెన్సార్ జరుపుకున్న హిట్ మూవీ

సెన్సార్ జరుపుకున్న హిట్ మూవీ

Published on Feb 26, 2020 10:45 AM IST

యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ హిట్. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం గ్రాండ్ గా విడుదల కానుంది. కాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. హిట్ మూవీలో విశ్వక్ సేన్ ఓ మిస్సింగ్ అండ్ మర్డర్ కేసు ఛేదించే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా కనిపించనున్నాడు.

హీరో నాని తన సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో ఈ చిత్రం తెరక్కుతుంది. దర్శకుడు శైలేష్ కొలను సీరియస్ ఇంటెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించాడు. హిట్ మూవీలో హీరోయిన్ గా రుహాని శర్మ నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు