మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ‘బాహుబలి’ విజువలైజింగ్..

మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ‘బాహుబలి’ విజువలైజింగ్..

Published on Dec 28, 2014 12:39 AM IST

baahubali
‘విజువలైజింగ్ ది వరల్డ్ అఫ్ బాహుబలి’ పేరుతో దర్శకధీరుడు రాజమౌళి విడుదల చేసిన తన తాజా సినిమా మేకింగ్ వీడియోకు యుట్యూబ్ లో అద్బుత స్పందన లభించింది. ఐదు రోజుల క్రితం విడుదలైన ఈ వీడియోను ఇప్పటివరకూ 10 లక్షల (వన్ మిలియన్) మంది ప్రేక్షకులు వీక్షించారు. ‘బాహుబలి’ చిత్ర బృందం పడుతున్న కష్టాన్ని ఈ మేకింగ్ వీడియోలో చూపించారు. చారిత్రాత్మక కోటల సెట్టింగ్స్ వేయడానికి ఎన్ని స్కెచ్ లు గీసింది, గ్రాపిక్ వర్క్స్ జరిగిన తీరును, సినిమా షూటింగుకి ఎలా రెడీ అయ్యింది ఈ వీడియోలో వివరించారు.

ప్రభాస్, అనుష్క, తమన్నా నటీనటులుగా రూపొందుతున్న ఈ చారిత్రాత్మక సినిమాపై ప్రేక్షకులలో భారి అంచనాలు నెలకొని ఉన్నాయి. రానా ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటివలే బల్గేరియాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు. 2015 ఏప్రిల్ లో సినిమా తొలి భాగాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యం.యం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ భాద్యతలు నిర్వర్తిస్తున్నారు.

‘విజువలైజింగ్ ది వరల్డ్ అఫ్ బాహుబలి’ వీడియో చూడడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు