తానేం ఆత్మహత్యాయత్నం చేయలేదన్న వరుణ్ సందేశ్ సతీమణి !


యంగ్ హీరో వరుణ్ సందేశ్ భార్య, నటి వితిక షేరు తానూ ఆత్మహత్యాయత్నం చేసినట్టు వస్తున్న వార్తలపై స్పందించారు. నిన్న రాత్రి నుండి సోషల్ మీడియాలో వరుణ్ సందేశ్ సతీమణి సూసైట్ అటెంప్ట్ చేశారని అందుకు వారి వైవాహిక జీవితంలో తలెత్తిన గొడవలే కారణమని వార్తలొచ్చాయి.

ఇవన్నీ వట్టి పుకార్లేనని, తాను, వరుణ్ సందేశ్ ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నామని, తమకెలాంటి విభేదాలు లేవని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. వరుణ్ సందేశ్ సైతం ఆ ట్వీట్ ను రీట్వీట్ చేసి పుకార్లను ఖండించారు. ‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ ప్రేమించుకుని గత ఏడాది ఆగష్టులో వివాహం చేసుకున్నారు.

 

Like us on Facebook