Like us on Facebook
 
‘ఉన్నది ఒక్కటే జిందగీ’ ప్రత్యేకత ఏంటో తెలిపిన రామ్ !

హీరో రామ్ తన తదుపరి చిత్రం ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రామ్ సరికొత్త గెటప్ లో కనిపించనున్నాడు. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన పాత్ర కూడా కొత్తగా ఉంటుందని తెలిపాడు. ఈ చిత్రం తనకు చాలా ప్రత్యకమైనదిగా రామ్ అభివర్ణించాడు. ఈ చిత్రంలో రాక్ స్టార్ గా కనిపించబోతున్న రామ్ పాత్ర పేరు అభిరామ్.

తనని పరాజయాల నుంచి బయట పడేసిన ‘నేను శైలజ’ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలోనే రామ్ మరో మారు నటిస్తున్నాడు.’ అభిరాం పాత్ర తనని మరో లెవల్ కు తీసుకుని వెళుతుందని ఆశిస్తున్నట్లు రామ్ తెలిపారు. లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్ లు ఈ చిత్రం లో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Bookmark and Share