‘ఉన్నది ఒకటే జిందగీ’ యూఎస్ కలెక్షన్స్ వివరాలు !

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన తాజా చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’ తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ తో నడుస్తున్న సంగతి తెలిసిందే. అలాగే యూఎస్ లో సైతం సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది. ప్రీమియర్లతో కలిపి మొదటి రోజు మొత్తం 1.78 లక్షల డాలర్లను రాబట్టిన ఈ సినిమా రెండవ రోజు శనివారం కూడా అదే జోరు కొనసాగించి 97లొకేషన్ల నుండి 71,369 డాలర్లను వసూలు చేసి మొత్తంగా 2. 49 లక్షల డాలర్లను ఖాతాలో వేసుకుంది.

ఒక రకంగా చెప్పాలంటే రామ్ సినిమాకు ఓవర్సీస్ లో ఇవి మంచి వసూళ్ళని చెప్పొచ్చు. ఇకపోతే వచ్చే శుక్రవారం వరకు వేరే సినిమాలేవీ లేకపోవడం ఈ చిత్ర కలెక్షన్లకు బాగా కలిసొచ్చే అంశం. కిశోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అనుపమ పరమేస్వరన్, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నర్తించగా శ్రీవిష్ణు కీలకపాత్ర చేశాడు.

 

Like us on Facebook