డిసెంబర్ 5న ‘ఉందిలే మంచి కాలం..’

డిసెంబర్ 5న ‘ఉందిలే మంచి కాలం..’

Published on Nov 26, 2014 3:47 PM IST

vundilae-manchikalam-mundu-
ఆమ్ ఆద్మీ పిక్చర్స్ పతాకంపై అరుణ్ దాస్యమ్ దర్శకత్వంలో రావిరాష్ దాస్యమ్ నిర్మించిన సినిమా ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’. సుధాకర్ కొమకుల, సీనియర్ నరేష్, రాధికా శరత్ కుమార్, కార్తిక్, అవంతిక, నీతూ చౌదరి, పూర్ణిమ ప్రధాన పాత్రలలో నటించారు. రామ్ నారాయణ్ సంగీతం అందించారు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను తెలియజేయడానికి చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించింది.

సుధాకర్ కొమకుల మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి ఈ సినిమా చూస్తున్న సమయంలో యవ్వనంలో తమ ఊరిలో జరిగిన సంఘటనలు గుర్తొస్తాయి. నరేష, రాధికలతో కలసి నటించడం మర్చిపోలేని అనుభూతి. సినిమాకి పాజిటివ్ బజ్ ఏర్పడింది. భాద్యతాయుతంగా తెరకెక్కించిన ఈ సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. అని అన్నారు.

నరేష్ మాట్లాడుతూ.. తండ్రి కొడుకుల మధ్య సన్నివేశాలను దర్శకుడు ఆసక్తికరంగా మలిచారు. నేను, రాధిక ఈ సినిమాలో జంటగా నటించాం. యూత్, మాస్, ఫ్యామిలీ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ట్రెండ్ క్రియేట్ చేసే సినిమా ఇది. అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకనిర్మాతలు అరుణ్ దాస్యమ్, రావిరాష్ దాస్యమ్, సంగీత దర్శకుడు రామ్ నారాయణ్, కార్తీక్ తదితరులు మంచి సినిమాకు పని చేసే అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు