అంతర్వేదిలో వీవీ వినాయక్ ప్రత్యేక పూజలు!

అంతర్వేదిలో వీవీ వినాయక్ ప్రత్యేక పూజలు!

Published on Apr 28, 2016 7:14 PM IST

vv-vinay
మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 150వ సినిమా కోసం రంగం సిద్ధం అయిపోయింది. మెగా అభిమానులంతా సంవత్సర కాలంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. రేపు (ఏప్రిల్ 29న) హైద్రాబాద్‌లో మెగాస్టార్ 150వ సినిమా వైభవంగా ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్న దర్శకుడు వీవీ వినాయక్, ఈ నేపథ్యంలోనే అంతర్వేదిలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిరు సినిమా స్క్రిప్ట్‌ను ఆలయంలో దేవుడి చెంత ఉంచి వినాయక్ ఈ పూజలు నిర్వహించారు.

ఇక ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ.. రేపు ప్రారంభం కానున్న ఈ సినిమాకు లక్ష్మీ నరసింహ స్వామి దీవెనలు ఉండాలని, ప్రత్యేకంగా అంతర్వేదికి వచ్చి ఈ పూజలు నిర్వహించినట్లు తెలిపారు. మెగా హీరోలు, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వైభవంగా లాంచ్ కానున్న ఈ సినిమా మే నెలలో సెట్స్‌పైకి వెళ్ళనుంది. రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు