‘రభస’కు వివి వినాయక్ వాయిస్ ఓవర్.

‘రభస’కు వివి వినాయక్ వాయిస్ ఓవర్.

Published on Aug 23, 2014 2:32 PM IST

Rabhasa

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఆది, సాంబ, అదుర్స్ వంటి సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు దర్శకుడు వివి వినాయక్. ఆది బ్యానర్లో ఎన్టీఆర్ నటిస్తున్న తాజా సినిమా ‘రభస’కు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఆగస్ట్ 29న ‘రభస’ విడుదల అవుతుంది. రోజు రోజుకి సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఎన్టీఆర్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతం అందించిన ‘రభస’ ఆడియో ఎన్టీఆర్ పాడిన ‘రాకాసి రాకాసి’ పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. ‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. మాస్ కమర్షియల్ ఎలెమెంట్స్ తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీతో ‘రభస’లో ఎన్టీఆర్ నుండి అభిమానులు ఆశించే అంశాలు అన్ని ఉంటాయని దర్శకుడు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు