భార్య, పిల్లల ప్రైవేట్ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్న తారక్ !
Published on Jul 9, 2017 12:41 pm IST


జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం ‘బిగ్ బాస్’ షో చేస్తున్న సంగతి తెల్సిందే. దీనికి సంబందించిన ప్రచార కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటున్నారు. తాజాగా నిన్న జరిగిన ప్రచార కార్యక్రమంలో తారక్ చాలా సరదగా మాట్లాడారు. మీరు ఎవరి ప్రవేట్ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అని విలేఖర్లు అడగ్గానే వెంటనే ఆయన నా భార్య లక్ష్మి ప్రణతి, కొడుకు అభయ్ ల లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నారు. దానికి గల కారణాల్ని కూడా వివరించారు.

ఇంతకు ముందు అభయ్ ను అమ్మ, నాన్నల్లో ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడగ్గానే వెంటనే నాన్న అని చెప్పేవాడు. కానీ కొన్ని రోజులు నుండి స్కూల్ కి వెళుతున్నాడు. నేను ఉదయం 7 కి షూటింగ్ కు వెళ్లి రాత్రి 9 కి ఇంటికెళ్ళేప్పటికీ నిద్రపోతున్నాడు. ఈ ఈవెంట్ కు వచ్చేముందు కూడా అడిగాను ఎవరంటే ఎక్కువ ఇష్టం అని. వెంటనే అమ్మ అన్నాడు. దాంతో అభయ్ లో ఇంతలా మార్పు రావడానికి కారణం ఏమిటి, నేను లేనప్పుడు వాళ్ళ అమ్మ నా గురించి ఏం చెబుతోంది అనే విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహం ఎక్కువైంది అంటూ నవ్వుతూ అన్నారు.

 
Like us on Facebook