‘దేవదాసు’ మధ్యలో వెళ్ళిపోవాలనుకున్న ఇలియానా

‘దేవదాసు’ మధ్యలో వెళ్ళిపోవాలనుకున్న ఇలియానా

Published on Aug 18, 2014 11:22 AM IST

ileana-1
గోవా బ్యూటీ ఇలియానా స్టార్డం అందుకొని టాప్ హీరోయిన్ గా కొనసాగింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా ప్రస్తుతం ఇలియానా మాత్రం బాలీవుడ్ లోనే తన అదృష్టాన్ని పరీక్షించు కుంటోంది. ప్రస్తుతం బాలీవుడ్ పరంగా ఈ భామ చేతిలో ఉన్నది ఒక్క సినిమానే అయినా తనకి ఆఫర్స్ వస్తాయని ఎంతో నమ్మకంగా చెబుతోంది.

ఇవన్నీ పక్కన పెడితే ఇలియానాకి గుర్తింపు తెచ్చిన చిత్రం ‘దేవదాసు’, అదే ఇలియానా తొలి సినిమా కూడా.. ఈ సినిమా ఇలియానాకి బాగా గుర్తింపు తెచ్చింది. కానీ ఇలియానా ఈ సినిమాని మధ్యలో వదిలేసి వెళ్ళిపోవాలని అనుకుందట.. ”దేవదాసు’ టైములో నాకు చాలా భయం వేసింది. అందుకే మధ్యలో వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆ టైంలో నా పారెంట్స్ ఇచ్చిన సపోర్ట్ తో ముందుకు వెళ్లాను. ఆ సినిమా విజయంతో పాటు మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది. అందుకే పని మీద అలగకూడదు. బాలీవుడ్ లో కూడా మంచి విజయాలు వస్తాయని’ ఇలియానా అంటోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు