కబీర్ సింగ్ ని క్రాస్ చేసిన వార్

కబీర్ సింగ్ ని క్రాస్ చేసిన వార్

Published on Oct 16, 2019 10:55 PM IST

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ల మధ్య నడిచే గురు శిష్యుల పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన వార్ మూవీ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతుంది. ఈ చిత్రం ఏకంగా 2019 హైయెస్ట్ గ్రాస్సింగ్ మూవీగా నిలిచింది.ఇప్పటివరకు 268 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన వార్ మూవీ తెలుగు తమిళ భాషల వసూళ్లతో కూడా కలిపి 280 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీనితో ఈ ఏడాదికి హైయెస్ట్ గ్రాస్సింగ్ మూవీగా ఉన్న కబీర్ సింగ్ రెండవ స్థానానికి, ఆతరువాత ఉరి మూవీ మూడవ స్థానానికి పడిపోయాయి. ఇప్పటికే ఆల్ టైం హైయెస్ట్ గ్రాస్సర్ లో లిస్టులో వార్ మూవీ 10వ స్థానానికి చేరుకుంది.

వసూళ్లు ఇంకా స్థిరంగా కొనసాగుతున్న తరుణంలో ఈ మూవీ ఇంకా ర్యాంక్ మెరుగు పరుచుకునే అవకాశం కలదు. యష్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కిన ఈ మూవీకి ఆనంద్ సిద్ధార్ద్ దర్శకత్వం వహించగా,వాణి కపూర్ హీరోయిన్ గా నటించింది. చాలా కాలం నుండి ఓ కమర్షియల్ హిట్ కొరకు ఎదురుచూస్తున్న హృతిక్ ఈ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు