ఇంటర్వ్యూ : రక్షిత్ – ‘లండన్ బాబులు’ ఔట్ ఫుట్ పట్ల చల్ హ్యాపీజగా ఉన్నాం !

ఇంటర్వ్యూ : రక్షిత్ – ‘లండన్ బాబులు’ ఔట్ ఫుట్ పట్ల చల్ హ్యాపీజగా ఉన్నాం !

Published on Nov 13, 2017 11:46 AM IST

మారుతి టాకిస్ బ్యానర్ పై చిన్నికృష్ణ దర్శకత్వంలో వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ‘లండన్ బాబులు’ ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్న ‘రక్షిత్ప్’ తో ఇంటర్వ్యూ…

ప్ర) లండన్ బాబులు సినిమా గురించి ?

జ) లండన్ బాబులు అనే సినిమా ‘ఆన్డువాన్ కట్లయి’ అనే తమిళ్ సినిమా రీమేక్. విజయ్ సేతుపతి హీరో గా నటించారు. ఈ సినిమా దర్శకుడు చిన్ని కృష్ణకు ఇది మూడో సినిమా .

ప్ర) సినిమా అవుట్ పుట్ ఎలా ఉంది ?

జ) యూనిట్ అందరం కలసి సినిమా చూశాం.. అందరికి బాగా నచ్చింది. అవుట్ ఫుట్ తో మేము హ్యాపీగా ఉన్నాం. సినిమా విజయవంతం అవుతుందని నమ్ముతున్నాను.

ప్ర) సినిమా నేపద్యం ఏంటి ?

జ) డబ్బు సంపాదించుకోవాలనుకున్న ఒక బిలో మిడిల్ క్లాస్ అబ్బాయి లండన్ ఎలా వెళ్ళాడు, అక్కడికి వెళ్ళడానికి పాస్ పోర్ట్ ఎలా సంపాదించాడు. అన్నది ఈ సినిమా కథాంశం. చాలా ఇంట్రస్టింగ్ గా డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించాడు.

ప్ర) స్వాతి పాత్ర గురించి ?

జ) స్వాతి ఈ సినిమాలో రిపోర్టర్ పాత్రలో కనిపిస్తోంది. హీరో లండన్ వెళ్ళడానికి ఆమె ఏవిధంగా సహాయపడిందో తెరమీదే చూడాలి. ఆమె నటన సహజంగా ఉంటుంది. ఆమెతో నేను ఫస్ట్ సినిమా చెయ్యడం హ్యాపీ ఎందుకంటే ఆమె సినిమాలు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటుంది కాబట్టి.

ప్ర) లండన్ బాబులు అనే టైటిల్ ఎందుకు పెట్టారు ?

జ) హీరో మరియు హీరో ఫ్రెండ్ అంతేర్వేది అనే గ్రామం నుండి హైదరాబాద్ వస్తారు అక్కడినుండి లండన్ ఎలా వెళ్ళారు అనేది ఇంట్రస్టింగ్ గా ఉండబోతుంది. నా ఫ్రెండ్ పాత్రలో కమెడియన్ సత్య బాగా చేసాడు. అతని నటన ప్రేక్షకులను నవ్విస్తుంది.

ప్ర) మీరు యాక్టర్ ఎలా అయ్యారు ?

జ) నేను విజయవాడ ఇంజినీరింగ్ కాలేజ్ లో బిటెక్ చేసాను. బిజినెస్ చేద్దామని హైదరాబాద్ వచ్చాను. అనుకోకుండా ఆర్టిస్ట్ అయ్యాను. డైరెక్టర్ మారుతి గారు నన్ను ప్రోత్సహించారు. మా నాన్న గారి ద్వారా మారుతి గారు నాకు పరిచయం.

ప్ర) మీ తదుపరి సినిమాలు?

జ) నెక్స్ట్ ఇయర్ ఒక సినిమా చేయబోతున్న, మారుతి గారితో సినిమా తప్పకుండా చేస్తాను. మంచి కథతో వస్తే సినిమా చెయ్యడానికి రెడీ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు