క్రిష్ వివాహా ముహూర్తం ఖరారు

క్రిష్ వివాహా ముహూర్తం ఖరారు

Published on Jun 25, 2016 5:22 PM IST

krish
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనదైన బ్రాండ్ సృష్టించుకొని సినిమాలు తీసుకుంటూ వెళుతోన్న క్రిష్, ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి సక్సెస్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇక అదేవిధంగా తన వ్యక్తిగత జీవితంలోనూ కొత్త సంతోషాలను నింపుకునేందుకు త్వరలోనే పెళ్ళి అనే బంధంతో క్రిష్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. డాక్టర్ రమ్యతో క్రిష్ వివాహం ఇప్పటికే ఖాయం కాగా, ఈ ఉదయం హైద్రాబాద్‌లోని ట్రిడెంట్ హోటల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక వైభవంగా జరిగింది.

నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రానా తదితర స్టార్స్ నిశ్చితార్థ వేడుకకు హాజరై క్రిష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఇదే సందర్భంగా ఇరు కుటుంబాల పెద్దలు ఆగష్టు 8న రాత్రి 2 గంటల 28 నిమిషాలకు పెళ్ళి జరపాల్సిందింగా నిర్ణయించారు. అంగరంగ వైభవంగా సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వివాహ వేడుకను జరపనున్నట్లు తెలుస్తోంది. ఇక క్రిష్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం బాలకృష్ణతో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అనే సినిమాను తెరకెక్కిస్తోన్న ఆయన సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు