‘డీజే’ తర్వాత పూజ హెగ్డే పొజిషన్ !

‘డీజే’ తర్వాత పూజ హెగ్డే పొజిషన్ !

Published on Jun 22, 2017 1:02 PM IST


ఆకట్టుకునే అందంతో పాటు, అభినందించదగిన అభినయం కూడా ప్రదర్శించగల హీరోయిన్ పూజ హెగ్డే. తెలుగులో చేసిన మొదటి సినిమా ‘ముకుందా’ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తరవాత తెలుగులో మంచి మంచి ఆఫర్లు వచ్చినా కూడా చైతన్యతో ‘ఒక లైలా కోసం’ మాత్రమే చేసి మిగతా వాటిని వద్దనుకుని బాలీవుడ్ బాట పట్టింది. కానీ అక్కడ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో చేసిన మొదటి సినిమా ‘మెహెన్ జోదారో’ ఆశించినంతగా సక్సెస్ కాకపోవడం వలన ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు.

దాంతో పూజ తిరిగి తెలుగులోనే అదృష్టం పరీక్షించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టి అల్లు అర్జున్ – హరీష్ శంకర్ల ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. తెలుగు ప్రేక్షకులు కూడా సినిమాలో ఆమె లుక్స్ కి బాగా ఫిదా అయ్యారు. ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ మీద ఆమెను చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు. పూజ గనుక వాళ్ళ అంచనాలను చేరుకోగలిగి, సినిమా మంచి సక్సెస్ సాధిస్తే పూజ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోవడం ఖాయం.

అంతేగాక ప్రస్తుతం పలువురు పెద్ద హీరోలు, దర్శకులు ఇప్పటికే మొదలుపెట్టి, ఇంకా హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఫైనల్ చేసుకొని ప్రాజెక్ట్స్ లో సైతం అవకాశాలు చేజిక్కించుకోవచ్చు. అది కాకుండా సినిమా ఫలితంలో తేడా జరిగితే ఆమె స్టార్ పొజిషన్ కోసం ఇంకొన్నాళ్ళు ఎదురుచూడాల్సి వస్తుంది. కనుక పూజ హెగ్డే భవితవ్యం ఏమిటనేది రేపటితో తేలిపోనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు