అఖిల్ – వినాయక్ ల మూవీ మూహూర్తం ఫిక్స్ అయ్యిందా.?

అఖిల్ – వినాయక్ ల మూవీ మూహూర్తం ఫిక్స్ అయ్యిందా.?

Published on Oct 26, 2014 9:54 AM IST

akhil-vv-vinayak

అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున వారసుడిగా ఈ తరం హీరోగా త్వరలో తెలుగు తెరకు పరిచయం కానున్న హీరో అక్కినేని అఖిల్. ఈ సంవత్సరం ‘మనం’ సినిమా చివర్లో కేవలం ఒక 2 నిమిషాలు కనిపించి అందరినీ ఆకట్టుకున్న అఖిల్ సోలో హీరోగా లాంచ్ అవ్వడానికి రంగం సిద్దం అయ్యింది. అఖిల్ తొలి సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహించనున్నాడని, నితిన్ ఫాదర్ అయిన సుధాకర్ రెడ్డి ఆ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు అని ఇది వరక
తెలియజేశాం.

చాలా రోజుల నుంచి ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని నవంబర్ మధ్యలో లాంఛనంగా ప్రారంభించే ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్ర టీం నవంబర్ 15వ తీదీని పరిశీలిస్తున్నట్లు సమాచారం. కానీ ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అలాగే అఖిల్ సరసన నటించే హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. అఖిల్ మొదటి సినిమాకి ‘ఢమరుకం’ ఫేం వెలిగొండ శ్రీనివాస్ కథని అందిస్తుంటే కోన వెంకట్ – గోపి మోహన్ కథా సహకారం – డైలాగ్స్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు