వీటిలో రామ్ చరణ్ మూవీకి ఫిక్స్ అయ్యే టైటిల్ ఏదో.?

వీటిలో రామ్ చరణ్ మూవీకి ఫిక్స్ అయ్యే టైటిల్ ఏదో.?

Published on Aug 5, 2015 8:28 AM IST

Ram-charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 9వ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్ శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ థాయ్ ల్యాండ్ లో జరుగుతోంది. ప్రస్తుతం పట్టాయలోని సముద్రంలో రామ్ చరణ్ పై వచ్చే క్లైమాక్స్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు. ఈ షూటింగ్ లో రామ్ చరణ్ తో పాటు నదియా, కృతి కర్భంద కూడా పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటె ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫైనలైజ్ కాలేదు. ప్రస్తుతం ఈ చిత్ర టీం టైటిల్ ని ఫైనలైజ్ చేసి మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఆగష్టు 22న అనౌన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు.

అందులో భాగంగా ఈ చిత్ర టీం ప్రస్తుతం నాలు టైటిల్స్ ని పరిశీలిస్తోంది.. అవే ‘బ్రూస్ లీ’, ‘ఫైటర్’, ‘మై నేమ్ ఈజ్ రాజు’, ‘విజేత’. ఈ టైటిల్స్ లో బ్రూస్ లీ, ఫైటర్ అనే టైటిల్స్ వైపు ఈ చిత్ర టీం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. కానీ అభిమానులు మాత్రం ‘మై నేమ్ ఈజ్ రాజు’ అయితే బాగుంటుందని భావిస్తున్నారు. మరి ఫైనల్ గా ఏ టైటిల్ ని ఫిక్స్ చేస్తారా అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాని అక్టోబర్ 15న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు