సురేందర్ రెడ్డి ఆ సినిమాను ఎందుకు వదిలేసినట్టు?

సురేందర్ రెడ్డి ఆ సినిమాను ఎందుకు వదిలేసినట్టు?

Published on Dec 8, 2016 4:40 PM IST

surender-reddy
తెలుగులో స్టార్ కమర్షియల్ డైరెక్టర్స్‌లో ఒకరైన సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ‘ధృవ’ ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా రేపు భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. సురేందర్ రెడ్డి, చరణ్‌ను ఓ పోలీస్ థ్రిల్లర్‌లో ఎలా చూపించారా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ధృవ రిలీజ్ తర్వాత సురేందర్ రెడ్డి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడతో ఓ సినిమా చేస్తారన్న ప్రచారం జరిగింది.

కాగా ఈ ప్రచారాన్ని సురేందర్ రెడ్డి స్వయంగా ఖండించారు. నిఖిల్ గౌడతో సినిమా చేయడం లేదని, ఆ ఆఫర్ వచ్చినా తనది చేయడం లేదని స్పష్టం చేశారు. సురేందర్ రెడ్డికి ఈ సినిమాతో భారీ పారితోషికం వచ్చే అవకాశం ఉన్నా, ఆయన ఈ సినిమా కాదనడం ఆసక్తికరంగా మారింది. మెగాస్టార్ చిరంజీవితో సురేందర్ రెడ్డి కొద్దికాలంగా ఒక స్క్రిప్ట్ గురించి చర్చిస్తూ వస్తున్నారు. మాకందిన సమాచారం మేరకు చరణ్, చిరు ఇద్దరూ ఈ సినిమాను దాదాపుగా ఓకే చేశారని తెలుస్తోంది. దీంతో చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం వదులుకోకూడదనే సురేందర్ రెడ్డి నిఖిల్ గౌడ సినిమాకు నో చెప్పేశారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు