రానా బర్త్ డే రోజు గుణశేఖర్ గుట్టుగా ఉన్నాడేంటి..!

రానా బర్త్ డే రోజు గుణశేఖర్ గుట్టుగా ఉన్నాడేంటి..!

Published on Dec 14, 2019 4:54 PM IST

దగ్గుబాటి వారి అబ్బాయి రానా అనతి కాలంలోనే ఆల్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ హీరో తెలుగు హిందీ తమిళం అనే భేదం లేకుండా ఇండియాలో గా అన్ని ప్రముఖ చిత్ర పరిశ్రమలలో సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్య షూటింగ్స్ కి లాంగ్ గ్యాప్ ఇచ్చి అమెరికా వెళ్లిన రానా తిరిగి వచ్చిన తరువాత ఇప్పుడిప్పుడే తాను కమిటైన చిత్రాల చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఐతే భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన రానాతో టాలీవుడ్ భారీ చిత్రాల దర్శకుడిగా ఉన్న గుణశేఖర్ ఓ పౌరాణిక చిత్రం ప్రకటించారు.

హిరణ్య కశిప అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రానా రాక్షస రాజైన హిరణ్య కశిపుడు పాత్ర చేస్తున్నారు. నేడు రానా పుట్టినరోజు నేపథ్యంలో ఈ చిత్రంపై దర్శకుడు గుణశేఖర్ నుండి ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడం కారణం ఏమిటనేది అర్థం కాలేదు. ఒక దశలో ఈ మూవీ ఆగిపోయిందనే పుకారు కూడా రావడం జరిగింది. ఐతే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి, భారీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం అని స్వయంగా రానా ప్రకటించడం జరిగింది. ప్రీ ప్రొడక్షన్ దశలో హిరణ్య కశిప ఉన్న నేపథ్యంలో గుణశేఖర్ కనీసం బర్త్ డే పోస్టర్ విడుదల చేయవచ్చు కదా అని రానా అభిమానులు అనుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు