ఫుల్ బిజీ అయిపోయిన రకుల్ !

ఫుల్ బిజీ అయిపోయిన రకుల్ !

Published on Jan 30, 2018 4:25 PM IST

తెలుగు స్టార్ హీరోయిన్ల జాబితాలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఎప్పుడూ ముందే ఉంటుంది. ఏ తెలుగు స్టార్ హీరో సినిమాకైనా ఆమె పేరును పరిశీలించాల్సిందే. ఏటా కనీసం ఆమెవి రెండు పెద్ద సినిమాలు ఉండేది. కానీ ఈ ఏడాది ఇంకా ఆమె తెలుగులో ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు. అలాగని ఆఫర్లు లేవా అనుకుంటే ఇతర భాషల్లో మాత్రం చాలా ఈజీగా గడుపుతున్నారామె.

హిందీలలో ఆమె చేసిన ‘అయ్యారే’ చిత్రం వచ్చేనెల రిలీజ్ కానుంది. అంతేగాక స్టార్ హీరో అజయ్ దేవగన్ సినిమాలో సైతం ఛాన్స్ దక్కించుకుంది. అలాగే తమిళంలో స్టార్ హీరో సూర్య, సెల్వ రాఘవన్ కలిసి చేస్తున్న సినిమాలోని ఇద్దరు హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ఇలా వేరే భాషల్లో మూడు పెద్ద సినిమాలతో బిజీగా ఉన్న ఆమె తెలుగులో ఇంకా సినిమాను ఓకే చేయకపోవడం వెనుక కారణం బిజీ షెడ్యూళ్లా లేకపోతే వచ్చే కథలు నచ్చడంలేదా అనేది ఆమె ద్వారానే తెలియాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు