బడ్జెట్ సమస్య వలనే ఆగిపోయిన రామ్ సినిమా !

బడ్జెట్ సమస్య వలనే ఆగిపోయిన రామ్ సినిమా !

Published on May 23, 2018 1:02 PM IST

యంగ్ హీరో రామ్, దర్శకుడు ప్రవీణ్ సత్తారు కలయికలో ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. అన్ని విధాలా భారీగా ఉండేలా ఈ సినిమాను రూపొందించాలని అనుకున్నారు ప్రవీణ్ సత్తారు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కాస్త ఆగిపోయినట్టు తెలుస్తోంది. అందుకు కారణం సినిమాపై భారీ బడ్జెట్ పెట్టాల్సి రావడమేనట.

కథ మిలిటరీ బ్యాక్ డ్రాప్లో ఉండటం, వివిధ ఖరీదైన లొకేషన్లలో సినిమాను రూపొందించాల్సి ఉండటంతో బడ్జెట్ ఎక్కువగా కేటాయించాల్సి వచ్చిందట. అయితే చిత్ర నిర్మాత స్రవంతి రవికిశోర్ అంత పెద్ద మొత్తంలో డబ్బు పెట్టడానికి సిద్ధంగా లేకపోవడంతో ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయట. దీంతో రామ్, ప్రవీణ్ సత్తారులు ఈ చిత్రాన్ని నిలిపివేసి కొంత కాలం తర్వాత వేరే కథపై కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారట. మరిప్పుడు ఈ భారీ బడ్జెట్ కథను సత్తారు వేరే పెద్ద హీరో దగ్గరకి తీసుకెళ్తారా లేకపోతే రామ్ కోసం కొత్త కథను సిద్ధం చేసుకుంటారా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు