ఆ స్టార్ డైరెక్టర్ తో అఖిల్ సినిమా ఉంటుందా ?
Published on Jul 20, 2017 9:22 am IST


మొదటి సినిమా తర్వాత కాస్త ఎక్కువ విరామమే తీసుకున్న అక్కినేని హీరో అఖిల్ ఈ మధ్యే విక్రమ్ కుమార్ సినిమాను మొదలుపెట్టి కంటిన్యూస్ గా షూటింగ్లో పాల్గొంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఆయన చేయబోయే తర్వాతి సినిమాల పై ఎక్కడ అధికారిక ప్రకటన లేని నైపథ్యంలో ఒక వార్త సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

అఖిల్ తన తర్వాతి సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుతో చేస్తారనేది ఆ వార్త. గతంలో పలుసార్లు చర్చలకు కూర్చున్న వీరిద్దరూ కలిసి సినిమా చేసేందుకు సుముఖంగానే ఉన్నారట. మరి ఈ వార్తల ప్రకారం వీరి ప్రాజెక్ట్ సంగతేమిటో తెలియాలంటే ఎవరో ఒకరి నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ‘జయ జానకి నాయక’ సినిమాతో బిజీగా ఉన్న బోయపాటి ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నారు.

 
Like us on Facebook