ఆర్ఆర్ఆర్ వైజాగ్ షెడ్యూల్ నందు చరణ్ జాయిన్ అయ్యేదెప్పుడు?

ఆర్ఆర్ఆర్ వైజాగ్ షెడ్యూల్ నందు చరణ్ జాయిన్ అయ్యేదెప్పుడు?

Published on Dec 12, 2019 9:03 AM IST

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్. టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు చేస్తున్న ఈ మల్టీ స్టారర్ పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తుండగా, చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈచిత్ర లేటెస్ట్ షెడ్యూల్ విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతుంది. గత రెండు రోజులుగా ఎన్టీఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ నందు రామ్ చరణ్ జాయిన్ అవుతున్నారా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఓ అవార్డు వేడుకలో భాగంగా చెన్నై వెళ్లిన రాంచరణ్ నిన్న హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. దీనితో ఆయన వైజాగ్ షెడ్యూల్ లో పాల్గొనే అవకాశం కలదని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ ఈ షెడ్యూల్ నందు కేవలం ఎన్టీఆర్ పైనే చిత్రీకరణ ఉన్నట్లయితే రామ్ చరణ్ పాల్గొనకపోవచ్చు.

డివివి దానయ్య నిర్మాతగా దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తుండగా అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాది జులై 30న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు