థమన్ కు చిరంజీవి ఆ ఛాన్స్ ఇస్తారా ?

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా’ కు ముందు అనుకున్నట్టు ఏ.ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందివ్వడంలేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. దీంతో అందరిలోనూ ఇప్పుడు ఆ సినిమాకి సంగీత దర్శకుడిగా ఎవర్ని ఎంచుకుంటారు అనే ఆలోచన మొదలైంది. చాలా మంది ఈ గోల్డెన్ ఛాన్స్ థమన్ కు దక్కుతుందని అంటున్నారు.

ఎందుకంటే ‘సైరా’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించింది థమనే. ఆ బీజీఎమ్ కు గాను మెగా అభిమానులు ఫిదా అయిపోయి థమన్ ను తెగ మెచ్చుకున్నారు. కొందరైతే అసలు సినిమా మొత్తానికి థమన్ పనిచేస్తే బాగుంటుందనే అభిప్రాయాల్ని కూడా వెల్లడించారు. మరి చిరు, రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డిల మనసులో ఏముందో, అసలు ఈ అవకాశం థమన్ ను వరిస్తుందా లేదా తెలియాలంటే కొంత సమయం ఎదురుచూడాల్సిందే.

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ మొదటి వారం నుండి ప్రారంభించనున్నారు.

 

Like us on Facebook