కొత్త ఇమేజ్‌ కోసం ‘జాదూగాడు’గా నాగశౌర్య!

కొత్త ఇమేజ్‌ కోసం ‘జాదూగాడు’గా నాగశౌర్య!

Published on May 23, 2015 1:07 PM IST

Naga-Shourya
‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘లక్ష్మి రావే మా ఇంటికి..’, చిత్రాల ద్వారా లవర్ బాయ్‌లా, మన పక్కింటి కుర్రాడిలా కనిపించి మంచి పేరు సంపాదించుకున్న యువహీరో నాగశౌర్య. తాజాగా ఆయన ‘జాదూగాడు’ పేరుతో ఓ మాస్ ఎంటర్‌టైనర్ ద్వారా మన ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ తనకున్న ఈ లవర్ బాయ్ ఇమేజ్ నుంచి కాస్త పక్కకొచ్చి చేస్తున్న ఈ సినిమా కోసం నాగశౌర్య ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నాడు.

‘చింతకాయల రవి’ ఫేం యోగేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సోనారిక బదోరియా కథానాయికగా నటించింది. సత్య ఎంటర్‌టైన్‌మెట్స్ పతాకంపై వి.వి.ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటివరకూ సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురుచూసిన యూనిట్, జూన్ 5కు రిలీజ్ ‌డేట్‌ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు అంతటా మంచి స్పందన వస్తోంది. ఆడియో సక్సెస్‌తో జోష్ మీదున్న యూనిట్ వరుసగా ప్రమోషన్లు చేసుకుంటూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఇక నాగశౌర్య కొత్త ఇమేజ్ కోసం ప్రయత్నిస్తూ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందా అన్నది వేచిచూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు