పవన్ కళ్యాణ్ తో నటించాలని ఆశపడుతోన్న స్టార్ హీరోయిన్ !


రకుల్ ప్రీత్ సింగ్ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ లో చాలా మంది బడా హీరోలతో నటించే అవకాశాన్ని రకుల్ దక్కించుకుంది. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోలతో రకుల్ కు నటించే అవకాశాలు వచ్చాయి. మరిన్ని పెద్ద ఆఫర్ లు ప్రస్తుతం రకుల్ చెంతకు చేరుతున్నాయి.

కాగా ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ తన కోరికని బయట పెట్టింది . పవన్ కళ్యాణ్ సరసన నటించాలని ఉన్నట్లు తెలిపింది. కాగా మరి కొన్ని ప్రాజెక్ట్ లు చేసిన తరువాత పవన్ పూర్తి స్థాయి రాజకీయాలకు పరిమితం కానున్నాడనే వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస చిత్రాలకు కమిటై ఉన్నాడు. వాటిలోనైనా అవకాశం దక్కుతుందన్న ఆశతో రకుల్ ఉన్నట్లు తెలుస్తోంది.

 

Like us on Facebook