పవన్ కళ్యాణ్ మరోసారి అదే సీన్ రిపీట్ చేస్తాడా ?

pawan
హిట్, ప్లాప్ లతో పనిలేని ఏకైక స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఆయనకు క్రేజ్, అభిమానులు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటారు. ఆ అభిమానులంతా పవన్ చేసే తరువాతి సినిమా ‘కాటరాయుడు’ పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా అవుతుందని బల్లగుద్ది చెబుతూ ఎందుకు అవుతుందో కారణం కూడా చెబుతున్నారు. అదేమంటే పవన్ కళ్యాణ్ గతంలో వరుస ఫ్లాపుల్లో ఉండగా 2012లో వచ్చిన భారీ హిట్ ‘గబ్బర్ సింగ్’. అందులో హీరోయిన్ శృతి హాసన్.

ఇంకేముంది ఈ ‘కాటమరాయుడు’ లో కూడా ఆమె హీరోయిన్ కనుక ఈసారి కూడా అదే సెంటిమెంట్ రిపీటై పవన్ భారీ బ్లాక్ బస్టర్ కొడతాడని ఖచ్చితంగా చెబుతున్నారు. మరి 2012లో పవన్ కు లాక్కెగా కలిసొచ్చి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన శృతి హాసన్ రాబోయే 2017 లో కూడా ఆయన హిట్ ఇస్తుందేమో చూడాలి. ఇకపోతే శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు ‘ఖైదీ నెం150’ ఫేమ్ తరుణ అరోరా విలన్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం పవన్ హాలీడే లో ఉండటంతో ఆయన తిరిగొచ్చాక జనవరి మొదటి వారంలో ఈ చిత్రం యొక్క కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.

 

Like us on Facebook