శంకర్ పాట చిత్రీకరణ సమయానికి పూర్తి చేస్తారా?

శంకర్ పాట చిత్రీకరణ సమయానికి పూర్తి చేస్తారా?

Published on Sep 19, 2014 2:17 AM IST

i-poster
బ్లాక్ బస్టర్ దర్శకుడు శంకర్ తన చిత్రం ‘ఐ’ ని అక్టోబర్ 23 న దీపావళి కానుకగా విడుదల చేస్తానని ప్రకటించారు.

కాని అనుకున్న తేది కి ఈ చిత్రం విడుదల అవ్వడం ప్రస్నార్ధకమేనని తమిళ్ సినీ వర్గాల అనుమానం. ఈ చిత్రం లోని ఒక పాట చిత్రీకరణ పూర్తి కావాల్సి వుంది. పాటలలో భారీ సెట్టింగులకి గ్రాఫిక్స్ కి ప్రాధాన్యతని ఇచ్చే శంకర్ ఈ పాట చిత్రీకరణ త్వరగా పూర్తి చేసి చిత్రాన్ని అనుకున్న తేది కి విడుదల చేయగలరా?

ఈ ప్రశ్న కి సమాధానం దొరకాల్సి వుంది. అభిమానులు మాత్రం ఈ చిత్రం అనుకున్న సమయానికి విడుదల అవ్వన్నుందని ఆశిస్తున్నారు. ఈ చిత్రం లో విక్రం అమీ జాక్సన్ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు