వెంకీ రెండు సినిమాల్ని ఒకేసారి చేస్తారా ?
Published on Nov 8, 2017 9:08 am IST

సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే తేజ డైరెక్షన్లో ఒక థ్రిల్లర్ కు ఓకే చెప్పిన అయన అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయనున్న ‘ఎఫ్ 2’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో కూడా నటిస్తారని వార్తలొస్తున్నాయి. ఈ వార్తల ప్రకారమే వెంకీ ఈ మల్టీస్టారర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే తేజ సినిమాతో పాటు ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నట్టవుతుంది.

వీటిలో డిసెంబర్ 13 నుండి తేజ సినిమా మొదలుకానుండగా, 2018 ఆరంభం నుండి అనిల్ రావిపూడి చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందట. పైన చెప్పినట్టు వెంకీ గనుక అనిల్ సినిమాకి ఒప్పుకుని ఉంటే ఈ రెండు సినిమాల్ని ఒకేసారి చేస్తారా లేక ముందు తేజ చిత్రం పూర్తిచేసి ఆ తర్వాత ‘ఎఫ్ 2’ ను మొదలుపెడతారా అనేది తేలాల్సి ఉంది. ఇకపోతే ఈ మల్టీ స్టారర్లో వెంకటేష్ తో పాటు నటించబోయే ఆ యువహీరో ఎవరనేది ఇంకా తెలియలేదు.

 
Like us on Facebook